మీకు నేను ఉన్నాను.. | CM Chandrababu Support To Tirupati Stampede Victims | Tirumala Incident | RTV
Tirumala Stampede: తిరుమలలో భారీ ట్రాఫిక్ జాం
తిరుమలలో తొక్కిసలాట ఘటన జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు. కానీ ఇంతలోనే భక్తులు వెంకటేశ్వురుని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. దీంతో తిరుమలలోని ఘాట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.
Tirupati Stampede:తిరుపతి ఘటన..తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మృతుల పట్ట తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ తొక్కిసలాట ఘటన ఎంతో బాధించిందని, మరణించిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్
తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఆరుగురు భక్తులు చనిపోయారు. అసలు ఏ సమయానికి ఏం జరిగింది. ఎలా జరిగింది అనేది పూర్తి వివరాలు ఈ కింది ఆర్టికల్ లో..
TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్పదించారు. ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసిందని ఆయన ఆరోపించారు. చిత్తశుద్ధిలేని వ్యక్తులకు పగ్గాలిచ్చారని ఆయన మండిపడ్డారు.
భక్తులు భారీగా వస్తారని తెలిసి ఎందుకు ఏర్పాట్లు చేయలేదు..Chandrababu
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ..అందుకు తగ్గ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP: ఈరోజు తిరుపతికి వెళ్ళనున్న సీఎం చంద్రబాబు
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేసి తరువాత ఈరోజు తిరుమలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.