Movies:ది గర్ల్ ఫ్రెండ్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీలో కనిపించబోతున్న నేషనల్ క్రష్
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొని దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ అమ్మడు వరుస ప్రాజెక్ట్స్ తో ఇటు సౌత్ లో అటు నార్త్ లో తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటోంది.తాజాగా వుమెన్ ఓరియెంటెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతోందని తెలుస్తోంది. ద గర్ల్ ఫ్రెండ్ పేరుతో మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది టీమ్.