Telangana: పువ్వాడా మజాకా.. మార్క్ ప్రచారంతో హోరెత్తిస్తున్న మంత్రి.. ఫోటోలు వైరల్..
ఖమ్మంలో పువ్వాడ అజయ్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చెప్పులు కుడుతూ.. జనాలకు చెప్పులా రక్షణగా ఉంటానంటున్నారు. అరటి పళ్లు విక్రయిస్తున్నారు. పాన్ కట్టి ఇస్తున్నారు. ఛాయ్ పెడుతూ వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు మంత్రి పువ్వాడ.