![వకీల్ సాబ్ ను గెలిపించండి.. బీజేపీతోనే సామాజిక తెలంగాణ: పవన్ కల్యాణ్](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-81-4-jpg.webp)
Telangana Elections 2023: తాను ఆంధ్రలో పుట్టినప్పటికీ తెలంగాణపై మమకారం ఎక్కువ అని, ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బంగారు తెలంగాణ పేరిట ప్రజలు మోసపోయారని, బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించిన బీజేపీతోనే సామాజిక తెలంగాణ సాధ్యమని పవర్ స్టార్ వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
ఇది కూడా చదవండి: దుబ్బాక నిధులను సిద్దిపేటకు పట్టుకపోయిండ్రు: ముత్యంరెడ్డి కొడుకును గెలిపించండి
దుబ్బాక నియోజకవర్గం చేగుంటలో రఘునందన్ రావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో పవన్ ప్రసంగించారు. రెండు పార్టీల కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్దసంఖ్యలో రావడంతో చేగుంట గాంధీ చౌరస్తా కిక్కిరిసింది. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం రఘునందన్ నిరంతరం శ్రమిస్తారని పవన్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను ఎన్నటికీ మర్చిపోలేనన్నారు పవన్ కల్యాణ్.