Telangana Elections 2023: ఆంధ్ర మాదిరిగానే తెలంగాణను కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ‘జనసేన పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ గడ్డ మీద.. అలాంటి తెలంగాణకు అండగా ఉంటా’ అని ఆయన అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు మద్దతుగా బుధవారం హన్మకొండలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తెలంగాణ అంతటా తాను తిరగలేనని, తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట ఓట్లు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవినీతి రహిత తెలంగాణ కావాలని పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘2009లో ప్రజా యుద్ధనౌక, గద్దర్ తో మాట్లాడినప్పుడు మేం కోరుకున్నది ఒక్కటే.. సామాజిక తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణ. బీసీలు ముఖ్యమంత్రిగా కావాలని ఆ రోజు ఎదురుచూశాం. కానీ, అది సాధ్యం కాలేదు’’ అన్నారు. తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే పదేళ్లుగా పార్టీని నడుపుతున్నానన్న పవన్ కల్యాణ్ బలిదానాలపై ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం కావడం బాధిస్తోందన్నారు. ఆంధ్ర తనకు జన్మనిస్తే, తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..వచ్చే ఏడాది నుంచి తెలంగాణ మొత్తం తిరుగుతా: హన్మకొండ బీజేపీ సభలో పవన్ కల్యాణ్
ఆంధ్ర తనకు జన్మనిస్తే, తెలంగాణ పునర్జన్మనిచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ అంతటా పర్యటిస్తానన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టాలని కోరారు.
Translate this News: