Telangana: తెలంగాణలో 608 నామినేషన్ల తిరస్కరణ..
తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ల వేయగా.. 608 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గరైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ల వేయగా.. 608 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గరైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
తెలంగాణ ఎన్నికల ప్రచారం ఇక మరింత రసవత్తరంగా మారనుంది. ప్రధాన పార్టీలకు చెందిన జాతీయ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. నవంబర్ 17వ తేదీన అమిత్ షా, రాహుల్ గాంధీలు వస్తున్నారు. బీజేపీ సభల్లో షా, కాంగ్రెస్ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.
ఈరోజు ఉదయం నాంపల్లి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి కీలక విషయాలను అగ్నిమాపక శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలను వివరించింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజలను మోసం చేయడం కేసీఆర్ కు వెన్నెతో పెట్టిన విద్య అని విమర్శించారు.
తన నామినేషన్ ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్. తుమ్మల చేసేది వెన్నుపోటు రాజకీయాలని విమర్శించారు. తాను పక్కాగా అన్ని వివరాలు అఫిడవిట్ లో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు జానారెడ్డి నామినేషన్ వేశారు. తాజాగా ఆయన నామినేషన్ ను ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేశారు. జానారెడ్డి నామినేషన్ తో పాటు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్స్ కూడా తిరస్కరించారు.
నేటి నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఏర్పాటు ఆలస్యం అయిందని అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆరు రోజులపాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో రాహుల్ పలు కీలక పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నాంపల్లి బజార్ఘట్లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు సానుభూతి తెలిపారు. పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని.. గాయాలపాలైనవారికి మెరుగిన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు.