Telangana: రూ.20 వేల కోట్లతో వరద సమస్యలు పరిష్కరిస్తాం.. మంత్రి కేటీఆర్ హామీ..
హైదరాబాద్లో రూ.20 వేల కోట్లతో వరద సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని అన్నారు. ప్రస్తుతం 70 కి.మీ మెట్రో ఉండగా దాన్ని 400 కిలోమీటర్లకు పెంచుతామని తెలిపారు.