BREAKING: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రస్తుతం సోహెల్ ముంబై నుంచి దుబాయికి పారిపోయినట్లు సమాచారం.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రస్తుతం సోహెల్ ముంబై నుంచి దుబాయికి పారిపోయినట్లు సమాచారం.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిపించడం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో తమకు సీట్లు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలోని పురుషులు. తమ కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తెలంగాణలో 6 గ్యారెంటీల అమలుకు తొలి అడుగు పడనుంది. ప్రజా పాలన కార్యక్రమంలో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ కూడా సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. డిసెంబర్ 28న ఈ ఫామ్ ద్వారా అప్లికేషన్స్ తీసుకోనున్నారు.
రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు 450 కోట్ల రూపాయలను విడుదల చేయాలని మోదీని కోరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం వివరాల గురించి మోదీకి నివేదిక ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఫిబ్రవరి చివరి నెలలో విడుదల అయ్యే అవకాశం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మార్చి నెల చివరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎంపీ ఎలక్షన్స్‌లో తెలంగాణకు ఇన్ఛార్జిగా అమిత్ షా వస్తారని తెలిపారు కిషన్ రెడ్డి.
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ బెదిరింపుల కేసు నమోదు అయింది. మున్సిపల్ కమిషనర్ కప్పరి స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఎంపీ బండి సంజయ్. తెలంగాణలో ఒక వర్గం ఓట్ల కోసం హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటు తో త్వరలో 25 వేల మందికి ఉద్యోగాలు కలుగుతాయని అన్నారు.