CM Revanth: పారిశ్రామికంగా దేశంలోనే నంబర్.1గా తెలంగాణను నిలుపుతాం: రేవంత్ రెడ్డి తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటు తో త్వరలో 25 వేల మందికి ఉద్యోగాలు కలుగుతాయని అన్నారు. By V.J Reddy 26 Dec 2023 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి CM Revanth Reddy: తెలంగాణలో అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న ఐటీ రంగం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీకి చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ రోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ ను కలిసింది. రాష్ట్ర ఐ.టీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఐ.టీ. శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజాన్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ALSO READ: గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు.. ఆ లక్కీ ఛాన్స్ వీరికేనా? సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని, అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామని అన్నారు. ఇదే విధంగా పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని సీఎం తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడం తోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని సీఎం తెలియజేశారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని అన్నారు. కొంగర కలాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. ఫాక్సాకాన్ సంస్థ చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు కూడా అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. లోకేష్ ట్వీట్! ఫాక్స్ కాన్ గ్రూప్ గురించి సమాచారం: * మార్చ్ 2023లో తెలంగాణ ప్రభుత్వంతో ఫాక్స్ కాన్ గ్రూప్ ఒప్పందం కుదిరింది. * ఫాక్స్ కాన్ సంస్థ ఆపిల్ ఐఫోన్లను ప్రధానంగా తయారుచేస్తుంది. * ఫాక్స్ కాన్ సంస్థ ప్రధాన కస్టమర్లలో Google, Xiaomi, Amazon, Hewlett Packard, HUAWEI, Alibaba Group, CISCO, Dell, Facebook, Nentendo, Sony, Microsoft, SEGA, Nokia వంటివి వున్నాయి. * చైనా, వియత్నాం, థాయ్లాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాలలో ఫాక్సాకాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది. మన దేశంలో ఏపీ (శ్రీ సిటి), తమిళనాడు (శ్రీ పెరంబుదూర్), తెలంగాణ (కొంగర కలాన్) మరియు కర్ణాటక (బెంగళూరు సమీపంలో) సంస్థ పనిచేస్తున్నది. * ఫాక్స్ కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఉపకరణాలు తయారుచేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఒక లక్ష ఉద్యోగాలను కల్పిస్తామనే హామీతో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (MoU) కుదుర్చుకున్నది. * మొదటి దశలో, వచ్చే రెండేళ్లలో 25,000 ఉద్యోగాలు కల్పించనున్నది. #it-jobs #telangana-news #cm-revanth-reddy #telangana-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి