11 మంది IASల బదిలీ... ఆ అధికారికి చెక్..!
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 11మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 11మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కేసీఆర్ ఫ్యామిలీ పాస్ పోర్టులు గుంజుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కేసీఆర్, ఆయన కుటుంబం దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని అన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కర్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12000 ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
సింగరేణిలో జరిగే ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న సంఘాన్ని గెలిపించాలని కోరారు మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఇందుకోసం ఆయన ఐఎన్టీయూసీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ నెల చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తారని పేర్కొన్నారు.
అసెంబ్లీలో ప్రసంగించిన గవర్నర్ తమిళిసై.. మెగా డీఎస్సీని నిర్వహించి 6 నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని.. ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు పడటంతో.. ఆమె తన ఎంపీ పదనిని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. అత్యు్న్నత న్యాయస్థానం ఏం తీర్పు ఇవ్వనుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు . ఎన్నికల సందర్భంగా మేం ప్రజలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మీ, రైతు భరోస, మహాలక్ష్మీ, గృహజ్యోతీ, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత ఈ ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు డబ్బులు ఎక్కడ నుంచి తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు.