BREAKING: తెలంగాణలో 26మంది ఐఏఎస్ ల బదిలీలు..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. మొత్తం 26మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది. ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జ ను నియమించింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. మొత్తం 26మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది. ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జ ను నియమించింది.
పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రిపరేషన్ మొదలుపెట్టామన్నారు. ఎంపీగా కేసీఆర్ పోటీ చేయడంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. ఢిల్లీ పెద్దల పోటీపై స్పష్టత వచ్చాకే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.
రౌడీషీటర్లకు రాచకొండ సీపీ సుధీర్ బాబు కౌన్సిలింగ్ ఇచ్చారు. గతాన్ని మరిచి.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు. మారిన రౌడీషీటర్లపై పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామన్నార. అవసరమైతే.. రౌడీషీట్‌ను కూడా ఎత్తేస్తామని చెప్పారు సీపీ సుధీర్ బాబు.
రోడ్ల నిర్మాణంలో అలసత్వానికి తావు ఉండకూడదని మంత్రి కోమటిరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని మాటిచ్చామని అందుకోసం పనులు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో న్యూఇయర్ వేళ భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్‌ను సీజ్ చేశారు పోలీసులు.
న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ డీజీపీ కీలక ఆదేశాలు ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపితే.. బండి సీజ్ చేసి, రూ. 10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలు నుంచి మంచి స్పందన లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజుల్లో ప్రజల నుంచి 40.57 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు దరఖాస్తుల స్వీకరణకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
ప్రజాపాలన దరఖాస్తులపై కీలక కామెంట్స్ చేశారు మంత్రి సీతక్క. ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు సమర్పించలేకపోయిన వారు జనవరి 6వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామ కార్యదర్శికి అందజేయవచ్చునని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయన్నారు.