Accident : అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం..
అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం చెందారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందారు.
అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం చెందారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందారు.
మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అయితే అతడిని తామే అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. రాత్రి 8 గంటలకు శ్రవణ్‌తో సహా నలుగురిని అరెస్టు చేశామని తెలిపారు.
ఈ ఆర్ధిక సంవత్సరంలో అంటే 2023-24 లో తెలంగాణ రాష్ట్ర పన్ను ఆదాయాలు పెరిగినట్టు కాగ్ వెల్లడించింది. బడ్జెట్ అంచనాల కంటే, ఏక్కువగా టాక్స్ రాబడి వచ్చినట్టు కాగ్ చెప్పింది. కాగ్ లెక్కల ప్రకారం 2024 మార్చి నాటికి 1.35 లక్షల కోట్లు పన్ను ఆదాయం తెలంగాణకు వచ్చింది.
తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లలో TS స్థానంలో TG ని అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకనుంచి రాష్ట్రంలో కొత్త నంబర్ ప్లేట్లు TGతో జారీ కానున్నాయి. ఇది కొత్తగా వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. పాతవి TSతో కొనసాగనున్నాయి.
తెలంగాణ కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ఎవరూ అనే అంశం తెరపైకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త అధక్షుడిని నియమిస్తామని గతంలోనే ఏఐసీసీ నేతలు ప్రకటించారు. ఈ పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ గౌడ్ తదితరులు ప్రయత్నిస్తున్నారు.
ఖమ్మం జిల్లా బోకకల్‌లో వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టుని ఢీకొని ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సుజాత అనే అంగన్వాడీ ఉపాధ్యాయురాలు హత్యకు గురైంది. తాడ్వాయి సమీపంలో కూలీపనుల కోసం అడవికి వెళ్లిన కొంతమందికి ఆమె మృతదేహాం కనిపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.
తెలంగాణలో టెట్ అభ్యర్థులు బుధవారం నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి జూన్ వరకు విద్యాశాఖ టెట్ నిర్వహించనుంది. తొలిసారిగా ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతి (సీబీటీ)లో ఉదయం, మధ్నాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.