Weather Alert: మరో నాలుగు రోజులు వానలే వానలు..
రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 15వరకు ఇదే వాతావరణం ఉంటుందని పేర్కొంది.
రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 15వరకు ఇదే వాతావరణం ఉంటుందని పేర్కొంది.
హైదరాబాద్‌లో ఈరోజు జీరో షాడో డే జరగనుంది. మధ్యాహ్నం 12:12 PM గంటలకు ప్రారంభమై.. రెండు, మూడు నిమిషాల వరకు కొనసాగుతుందని హైదరాబాద్‌లోని బి.ఎం.బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు బుధవారం తెలిపారు.
ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. నర్సాపూర్, సరూర్‌నగర్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 4.00 PM గంటలకు నర్సాపూర్, 6.00 PM గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు.
తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను మే 9 నుంచి ప్రారంభిస్తున్నామని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. జూన్ 1 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
కరీంగనగర్ జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ జూదం కోసం స్నేహితుల వద్ద రూ.12 లక్షలు అప్పు చేసి వాటిని పోగొట్టుకున్నాడు. అప్పులు ఎక్కువవ్వడంతో చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పంటు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. రూ.2 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం జరిగింది. చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లవన్ కుమార్ గుప్త(22) ఉద్యోగం రాక తీవ్ర మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కిన్నెర వాయిద్యకారుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహిత దర్శనం మొగులయ్యకు.. మజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. మొగులయ్య ప్రస్తుతం కూలీ పనులు చేసుకుంటున్న ఓ వీడియో వైరల్ కావడంతో కేటీఆర్ ఆయన్ని కలిసి ఆర్థిక సాయం చేశారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో రూల్స్‌కు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత కూడా పబ్‌ను నిర్వహిస్తున్నారని 'ఆఫ్టర్ నైన్' పబ్‌పై పోలీసులు దాడులు చేశారు. 160 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.