Hyderabad: భార్యను చంపిన భర్త.. మృతదేహన్ని ముక్కలు చేసేందుకు యత్నం
హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. సాయి అనురాగ్ కాలనీలో ఉంటున్న నాగేంద్ర భరద్వాజ అనే వ్యక్తి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన తన భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసేందుకు యత్నించాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.