Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
హైదరాబాద్‌లో కేబుల్ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ బైక్ డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు బ్రిడ్జి పైనుంచి కిందపడి అక్కడిక్కడే మృతిచెందారు.
హైదరాబాద్‌లో కేబుల్ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ బైక్ డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు బ్రిడ్జి పైనుంచి కిందపడి అక్కడిక్కడే మృతిచెందారు.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో వరదల బీభత్సానికి దాదాపు 1300 యాత్రికులు చిక్కుకున్నారు. అందులో పలువురు తెలుగువాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం హెలీకాప్టర్ల సాయంతో సహాయక బృందాలు చిక్కుకున్న యాత్రికులను తరలిస్తున్నాయి.
తెలంగాణ జాబ్ క్యాలెండర్ ను కొద్ది సేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. దీని ప్రకారం అక్టోబర్ లో గ్రూప్-1, మేలో గ్రూప్-2, ఏప్రిల్ లో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్-3 నోటిఫికేషన్ ను జులైలో విడుదల చేయనున్నారు.
TG: ధరణి పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేశారని కాంగ్రెస్ ఆరోపించిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దానిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. BRSను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందా? అని నిలదీశారు.
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు NHAI గుడ్ న్యూస్ చెప్పింది. ఖమ్మం-సూర్యాపేట రోడ్డు హైదరాబాద్-విజయవాడ హైవేను కలిసే ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. దీంతో ఖమ్మం నుంచి వచ్చే వాహనదారులు యూటర్న్ కోసం 2 కి.మీ ప్రయాణించాల్సిన అవసరం ఉండదు.
మీర్ఖాన్ పేటలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆరు కోర్సులతో ఈ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు.
ఖమ్మం జిల్లా గంగారంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సేవాలాల్ తండా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పిట్ల రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలిని పిచ్చి కుక్కలు పీక్కు తిన్నాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో కుక్కల గుంపు ఆమెపై దాడి చేశాయి. రాజ్యలక్ష్మి చనిపోయిన తర్వాత ఆమె శరీరంలోని అవయవాలను కుక్కలు కొరుక్కుతిన్నాయి.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.