అధికారులు నిద్రపోతున్నారా ? మగనూరు ఘటనపై హైకోర్టు ఆగ్రహం
నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అధికారులు నిద్రపోతున్నారా ? అంటూ ధ్వజమెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదంటూ మండిపడింది.