మాదాపూర్‌లో నోట్ల కట్టలు.. రూ. 5 కోట్లు ఎవరివి!
హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీగా నగదు పట్టుబడింది. మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు తనిఖీల్లో రెండు సంచుల్లో తరలిస్తున్న రూ. 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సొమ్మును ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీగా నగదు పట్టుబడింది. మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు తనిఖీల్లో రెండు సంచుల్లో తరలిస్తున్న రూ. 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సొమ్మును ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌లో కోట్లాది రూపాయల అవినీతికి కేసీఆర్ కుటుంబం పాల్పడిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి వరంగల్ లో ధ్వజమెత్తారు. కేసీఆర్ కు డబ్బే ముఖ్యమని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను అధికారంలోకి తేవడానికి బీజేపీ అన్ని ప్రయాత్నలను చేస్తోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగిపోయానంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని సిద్దిపేట బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఎవరికీ అమ్ముడుపోలేదంటూ సిద్దిపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలోకి పసుపునీళ్లతో వెళ్లి, అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరీహోరీగా సాగుతున్న వేళ.. మంత్రుల నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం మంత్రుల టార్గెట్ గా వారి నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి.
బంగారు తెలంగాణ పేరుతో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను మోసగించిందని, సామాజిక తెలంగాణ కావాలంటే బీజేపీని గెలిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంటలో రోడ్ షోలో ఆయన పాల్గొని రఘునందనరావుకు మద్దతు తెలిపారు.
దుబ్బాక నిధులు సిద్దిపేటకు మల్లిపోకుండా ఉండాలంటే కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రసంగించారు. రఘునందనరావు మాట తప్పారని, మూడేళ్లలో ఆయన దుబ్బాకకు చేసిందేమీ లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి అవుతా అంటున్నారని కానీ ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరని మంత్రి హరీష్ రావు అన్నారు. జానారెడ్డి పోటీ చేయకున్న సీఎం అవుతా అంటున్నారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో 10 మంది సీఎంలు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ అంశంతో పాటు మేనిఫెస్టోలోని హామీలతో రాష్ట్రంలో పరిస్థితి తమకు అనుకూలంగా మారుతోందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 33 సీట్లలో టఫ్ ఫైట్ ఇస్తున్నామని.. ఇందులో 25 గ్యారెంటీగా గెలుస్తామని లెక్కలేసుకుంటోంది. ఇదే జరిగితే చక్రం తిప్పుతామన్న ధీమాతో ఉంది.
ఈ రోజు సూర్యాపేటలో జరిగిన పవన్ కల్యాణ్ మీటింగ్ కు బీజేపీ శ్రేణులతో పాటు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. పూలు చల్లుతూ, కేరింతలు కొడుతూ, సీఎం.. సీఎం.. అంటూ రచ్చ రచ్చ చేశారు. పవన్ నోటి నుంచి గద్దర్ బండెనుక బండి పాట రావడంతో ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోయారు.