తెలంగాణలో కమలదళం (Telangana BJP) గేర్ మర్చినట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో ప్రకటన తర్వాత తమ గ్రాఫ్ పెరిగిందని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో పాటు అగ్రనేతల సుడిగాలి పర్యటనలతో కార్యకర్తల్లో ఫుల్ జోష్ వచ్చిందని అంచనా వేస్తోంది. బీసీ సీఎం ప్రకటన, ఎస్సీ వర్గీకరణకు అనుకూలం కారణంగా సైలెంట్ ఓటింగ్ ఉంటుందని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాలకు గానూ.. 33 చోట్ల టఫ్ ఫైట్ ఇస్తోంది కాశాయ పార్టీ. ఇందులో 25 సీట్లలో గెలుపు ఖాయమనే అంచనాలు వేసుకుంటోంది. ఈ 25 సీట్లు సాధిస్తే చక్రం తిప్పొచ్చనే ఆలోచనలో బీజేపీ అగ్ర నాయకత్వం ఉంది. ఈ అంచనాలతోనే డిసెంబర్-3 తర్వాత ఏం జరుగుతుందో చూడండి అంటూ ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana Elections: రైతుల చుట్టే తెలంగాణ ఎలక్షన్స్.. ఎవరికి పట్టం కట్టేనో మరి..!
ఈ సీట్లలో టైట్ ఫైట్ ఉంటుందని బీజేపీ భావిస్తోంది..
హైదరాబాద్:
1. మహేశ్వరం - అందెల శ్రీ రాములు యాదవ్
2.కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్
3.రాజేందర్ నగర్ - తోకల శ్రీనివాస్ రెడ్డి
4.గోషామహల్ - రాజాసింగ్
5.లింగంపల్లి - రవికుమార్ యాదవ్
6.అంబర్ పేట - కృష్ణయాదవ్
7.ఎల్బీనగర్- సామ రంగా రెడ్డి
కరీంనగర్:
8.హుజురాబాద్- ఈటల రాజేందర్
9.కరీంనగర్ - బండి సంజయ్
10.వేములవాడ- వికాస్ రావు
11.కోరుట్ల- ధర్మపురి అర్వింద్
12.మానకొండూర్- ఆరెపల్లి మోహన్
13.జగిత్యాల- డా.బోగ శ్రావణి
వరంగల్:
14.భూపాలపల్లి - కీర్తిరెడ్డి
15.వరంగల్ వెస్ట్- రావు పద్మ
16.వరంగల్ ఈస్ట్- ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
17.డా.కాళి ప్రసాద్ ...పరకాల
18.హుస్సేన్ నాయక్...మహబూబాబాద్
ఆదిలాబాద్:
19.ఆదిలాబాద్ - పాయల్ శంకర్
20.బోథ్ - సోయం బాపూరావు
21.ఖానాపూర్ - రాథోడ్ రమేష్
22.నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి
23.ముథోల్- రామారావు పటేల్-
నిజామాబాద్:
24.నిజామాబాద్ అర్బన్ - ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
25.నిజామాబాద్ రూరల్ - దినేష్ కులాచారి
26.ఆర్మూర్ - పైడి రాకేష్ రెడ్డి
27.కామారెడ్డి- కాటిపల్లి వెంకటరమణారెడ్డి
నల్గొండ :
28.మునుగోడు - చలమల కృష్ణ రెడ్డి
మెదక్ :
29.దుబ్బాక - రఘు నందన్ రావు
30.గజ్వేల్ - ఈటల రాజేందర్
31.నర్సాపూర్ - ఎర్రగొల్ల మురళి యాదవ్
మహబూబ్‌నగర్
32.కల్వకుర్తి - తల్లోజు ఆచారి
33.మహబూబ్‌నగర్ - మిథున్ రెడ్డి
34.మక్తల్ - జలందర్ రెడ్డి
బీజేపీ బలంగా ఉన్న సీట్లు..!
1.కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్
2.ఎల్బీనగర్- సామ రంగా రెడ్డి
3.మానకొండూర్- ఆరెపల్లి మోహన్
4.జగిత్యాల- డా.బోగ శ్రావణి
5.మహబూబాబాద్- హుస్సేన్ నాయక్
6.నర్సాపూర్ - ఎర్రగొల్ల మురళి యాదవ్
7.కల్వకుర్తి - తల్లోజు ఆచారి
8.మహబూబ్‌నగర్ - మిథున్ రెడ్డి