BREAKING: మూడు రోజులు వైన్ షాపులు బంద్!
ఈ నెల 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో మద్యం షాపులు మూసివేయనునట్లు ప్రకటించింది.
ఈ నెల 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో మద్యం షాపులు మూసివేయనునట్లు ప్రకటించింది.
పవన్ కళ్యాణ్ పై మరోసారి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు దర్శకుడు ఆర్జీవీ. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారం కంటే బర్రెలక్క (శిరీష) చేస్తోన్న ప్రచారం మేలు అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఆర్జీవీ ట్వీట్ పై పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు ఉండేవని అని అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోవడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే.. సీఎం కేసీఆర్ ఎంతో మేలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రం కోసం కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్లు ఈ సారి ఏ పార్టీ వైపు నిలబడుతారన్నది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ కు మళ్లీ జై కొడతారా? హస్తం పార్టీకి ఒక్క ఛాన్స్ ఇస్తారా? బీజేపీని ఆదరిస్తారా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లీం రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తోందని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.
ఈరోజు కామారెడ్డిలో పర్యటించారు ప్రధాని మోదీ. బీజేపీ హామీ ఇచ్చిందంటే అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు మోదీ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్ ఈ సారి మరింత డిఫరెంట్ గా మారాయి. గత రెండు ఎన్నికల్లో కేవలం ఒక్కో స్థానానికే పరిమితమైన బీఆర్ఎస్ ఈ సారి మెజార్టీ స్థానాల్లో సత్తా చాటేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. తమ కంచుకోటను నిలుపుకోవడం కోసం కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.