Telangana Election: బీజేపీ బీసీ సీఎం ప్రకటన.. తెలంగాణ ప్రజలకు సువర్ణావకాశం: లక్ష్మణ్
పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంట్ బోర్డ్ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ శుక్రవారం హైదరాబాద్లో ప్రకటన విడుదల చేశారు. సూర్యాపేట జనగర్జన బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ఎన్నికల బహిరంగ సభలో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.