Telangana Elections: సూర్యాపేట టికెట్ రాకపోతే?: దామోదర్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
సూర్యాపేట టికెట్ ఎవరికి వచ్చినా కాంగ్రెస్ గెలుపుకోసం పని చేయడానికి తాను సిద్ధం అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఈ రోజు నామినేషన్ వేస్తున్నానన్నారు.
KA Paul: నామినేషన్స్ గడువు పెంచండి.. ఈసిని డిమాండ్ చేసిన కేఏ పాల్
తెలంగాణలో నామినేషన్ల గడువును పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పెంచాలన్నారు. ఇదే సమయంలో తమ పార్టీ అభ్యర్థుల రెండవ జాబితాను విడుదల చేశారు కేఏ పాల్. ఈ లిస్ట్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. క్లస్టర్ ఇంచార్జీలను నియమించిన కాంగ్రెస్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 10 మంది క్లస్టర్ ఇంచార్జిలతో పాటు.. 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
Telangana Elections: ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటారు? భట్టి సంచలన కామెంట్స్..
సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలతో దళిత, గిరిజన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేసిన భట్టి విక్కమార్క.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు.
MLC Kavitha: ఫేక్ ప్రామిస్‌లకు కేరాఫ్ కాంగ్రెస్.. ఆర్టీవీ స్టోరీని ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ కవిత..
కర్నాటకలో వ్యవసాయానికి కేవలం 5 గంటల మాత్రమే విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఆ రాష్ట్ర మంత్రి ఆర్టీవీకి చెప్పారు. వీడియోపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు.
Congress 3rd List: దామోదర్ రెడ్డి కోసం రంగంలోకి కోమటిరెడ్డి.. అదే జరిగితే అద్దంకి ఔట్?
కాంగ్రెస్ మూడో లిస్ట్ పై ఇంకా ఉత్కంఠ వీడడం లేదు. పోటీ తీవ్రంగా ఉండడంతో హైకమాండ్ కూడా ఈ సీట్ల విషయంలో ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. సూర్యాపేటలో దామోదర్ రెడ్డికి టికెట్ ఇప్పించడం కోసం కోమటిరెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
Telangana: దేవరకొండలో బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి గుత్తా అనుచరులు..
నల్లగొండ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాన అనుచరులు దేవరకొండ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, ఎంపీపీ జాన్ యాదవ్, సిరందాస్ కృష్ణయ్య, లక్ష్మమ్మ, కృష్ణయ్య, వడ్త్యా దేవేందర్ నాయక్ సహా పలువురు కాంగ్రెస్‌లో చేరారు.
Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు డీకే శివకుమార్ షాక్.. ఆ ఒక్క ప్రకటనతో..
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చారు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్. విద్యుత్ సరఫరాపై ఆయన చేసిన కామెంట్స్.. టి. కాంగ్రెస్ నేతలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇక్కడి నేతలు తాము గెలిస్తే రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామంటుంటే.. డీకే శివకుమార్ మాత్రం కర్ణాటకలో 5 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నామని ప్రకటించి బాంబ్ పేల్చారు. డీకే వ్యాఖ్యలతో కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు.