AP : అనపర్తి లో రగులుతున్న టీడీపీ అసంతృప్తి జ్వాలలు!
అనపర్తి అసెంబ్లీ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణం రాజు ఎన్నికల ప్రచారాన్ని స్థానిక తెలుగు దేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో శివరామరాజుకి ఘోర అవమానం జరిగింది.
అనపర్తి అసెంబ్లీ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణం రాజు ఎన్నికల ప్రచారాన్ని స్థానిక తెలుగు దేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో శివరామరాజుకి ఘోర అవమానం జరిగింది.
ఒంగోలు రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగడంంతో ఇరు వర్గాల వారు దాడులకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 400 మంది టీడీపీ నాయకులు తమ రాజీనామా పత్రాలను రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి పంపారు. సీటు అధికారికంగా రఘురామ కృష్ణంరాజుకు అనౌన్స్ అయితే పరిణామాలు వేరేగా ఉంటాయంటూ రామరాజు వర్గీయులు హెచ్చరిస్తున్నారు.
టీడీపీ, జనసేన కూటమి నుంచి వైసీపీలోకి పలువురు కీలక నేతలు ఈరోజు జగన్ సమక్షంలో చేరారు. ఇందులో పోతిన రమేష్, మాజీ ఎమ్మెల్యేలు R.రమేష్ కుమార్ రెడ్డి, పాముల రాజేశ్వరీదేవిలు ఉన్నారు.
మాజీ మంత్రి పేర్నినాని, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణ మూర్తి (కిట్టు) నానా రచ్చ చేశారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారిని బాధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎస్సై చాణిక్యతో పేర్ని నాని , ఆయన అనుచరులు చాలా దురుసుగా ప్రవర్తించారు.
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ తరుఫున ప్రచారం నిర్వహిస్తామని వివరించారు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాట ప్రకారం పవన్ గెలిపించి తీరతామని వర్మ పేర్కొన్నారు,రాష్ట్రం అంతా ప్రచారం చేయవలసిన బాధ్యత మాపై ఉంది.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాకపోయినా మా ప్రచారం ఆగదని వర్మ పేర్కొన్నారు
నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫారుఖ్కి పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఆయన వాహనం తమ్మరాజు పల్లె వద్ద గేదెలను ఢీకొట్టింది. వెంటనే ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఫారుఖ్ బయటపడ్డాడు.
ఏపీ అప్పులు తీరాలన్నా, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావాలన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. టీడీపీ, వైసీపీ పార్టీలు తోడు దొంగలని విమర్శలు గుప్పించారు. బాబు, జగన్, పవన్ ముగ్గురు బీజేపీకి బానిసలని కామెంట్స్ చేశారు.