TDP : నరసాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు.. రెబల్‌గా మాధవ నాయుడు నరసాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు కనిపిస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాధవ నాయుడు ఇప్పుడు రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నరసాపురం అసెంబ్లీ సీటుని జనసేనకు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. By Jyoshna Sappogula 11 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Narasapuram : పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా నరసాపురం టీడీపీ(TDP) లో అసంతృప్తి సెగలు కనిపిస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాధవ నాయుడు(Madhava Naidu) ఇప్పుడు రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నరసాపురం అసెంబ్లీ సీటుని జనసేనకు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. జనసేన(Janasena) నుంచి బొమ్మిడి నాయకర్ పోటీ చేస్తున్నారు. Also Read: ”నాకు మార్కులు వేయకపోతే.. మా తాతతో చేతబడి చేయిస్తా”..పదో తరగతి విద్యార్థి మాస్ వార్నింగ్! అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన మాధవ నాయుడు ఎట్టి పరిస్థితిలోనూ నాయకర్‌కు మద్దతు ఇచ్చేది లేదంటున్నారు. నరసాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు మాధవ నాయుడు పేరెత్తకపోవడంతో నాయుడు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లు వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుపై పోరాటం చేసినా టీడీపీలో కనీసం గుర్తింపు లేదంటూ మాధవ నాయుడు అనుచరులు మండిపడుతున్నారు. #madhava-naidu #narasapuram #tdp #janasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి