AP: వాలంటీర్లకు ఆ అలవెన్స్ రద్దు చేసిన ప్రభుత్వం!
ఏపీలో గత ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన పేపర్ అలవెన్స్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం తమ పేపర్ సర్క్యూలేషన్ ను పెంచుకోవడానికే ఇలా అలవెన్స్ లు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏపీలో గత ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన పేపర్ అలవెన్స్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం తమ పేపర్ సర్క్యూలేషన్ ను పెంచుకోవడానికే ఇలా అలవెన్స్ లు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏపీ రాష్ట్ర మహిళలకు టీడీపీ ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. జూన్ 24న జరిగే మొదటి మంత్రివర్గ సమావేశంలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కమిటీ నివేదిక సమర్పించిన నెలరోజుల్లోనే ఫ్రీ బస్సు జర్నీ మొదలుకానున్నట్లు సమాచారం.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో TDP - JSP మధ్య ముసలం మొదలైంది. తెలుగు తమ్ములు.. జనసైనికులు విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో పట్టుకోసం ఇరు పార్టీ నాయకులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ కార్యాలయ భవనంపై టీడీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. శరత్ థియేటర్లో భాగస్వామ్యులను బెదిరించి మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారడంతో థియేటర్ భాగస్వామి యువసేన.. చంద్రన్న అసెంబ్లీలోకి పునరాగమనం అంటూ ఫ్లెక్సీలు పెట్టాడు.
ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడ్ని శాసన సభలో వైసీపీ ప్రభుత్వం హేళన చేయండంతో 2021 నవంబర్ 19 న మళ్లీ ఈ సభకు ఈ సీఎంగానే అడుగుపెడతానని శపథం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలిచిన ఆయన నేడు సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
18వ లోక్‌సభలో సంఖ్యాపరంగా టీడీపీ ఆరో అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ- 240, కాంగ్రెస్ - 99, సమాజ్‌వాదీ పార్టీ- 37, తృణమూల్ కాంగ్రెస్- 29, డీఎంకే - 22 టాప్ ఐదు స్థానాలలో ఉన్నాయి. 16 ఎంపీలతో టీడీపీ 6వ స్థానం.. నలుగురు ఎంపీలతో వైసీపీ 15వ స్థానంలో ఉంది.
AP: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని బుచ్చయ్యను మంత్రి కోరారు. రేపు బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత , పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ మరికాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం ఉదయం 9:30కి విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి ఇక అన్నీ మంచి రోజులేనని నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు. కౌరవ సభ స్థానంలో కొలువయ్యే గౌరవ సభ.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందనే పూర్తి నమ్మకం తనకుందని పేర్కొన్నారు.