TDP- YCP: కాకినాడ జిల్లా గాడిమొగలో ఉద్రిక్తత.. టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు..!

కాకినాడ జిల్లా గాడిమొగ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గ్రామంలో వెళ్లొదంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో, ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతవారణం నెలకొంది.

New Update
TDP- YCP: కాకినాడ జిల్లా గాడిమొగలో ఉద్రిక్తత.. టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు..!

TDP- YCP: కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం గాడిమొగలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ప్రచారాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు అనుమతితో గాడిమొగలో టీడీపీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే, గ్రామం లోకి వెళుతున్న టీడీపీ కూటమి అభ్యర్థి కార్యకర్తలను గ్రామం లోకి వెళ్లొదంటూ అటుగా వెల్లుతున ఐ. పోలవరం బైరవ పాలెం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది.

Also Read: హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఫైరింగ్.. నిందితుడు సూసైడ్

సంఘటన పై టీడీపీ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తీవ్రంగా ఖండించారు. ప్రచారానికి వస్తున్న కార్యకర్తలను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ జాగ్రత్తలు తీసుకోవాలని దాట్ల సుబ్బరాజు హెచ్చరించారు.  మరోసారి ఇలా జరిగితే మాత్రం సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు