TDP Chief Chandrababu: ఈసారి వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావు: చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావన్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన మహిళా ప్రగతి కోసం ప్రజా వేదిక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈసారి వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ప్రతీ ఇంట్లో మహిళలే.. ఆర్థిక మంత్రి.. సూపర్ సిక్స్ లో భాగంగా మహా శక్తికి మొదటిగా ప్రాధాన్యత కల్పించామని తెలిపారు చంద్రబాబు. మా తల్లి పడిన కట్టెల పొయ్యి కష్టాన్ని చూసి తట్టుకోలేక ఆడ బిడ్డలను ఆదుకునే విధంగా దీపం పథకాన్ని ప్రారంభించానన్న ఆయన.. వైకుంఠపాళీ మాదిరిగా మారింది ప్రస్తుత పరిస్థితి.. నేను అభివృద్ధి చేస్తే.. వాటిని వీళ్ళు నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.