Tamilnadu: రెండు రోజుల్లో శుభవార్త చెబుతా..కమల్ హసన్
దేశంలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది. దాదాపు అన్ని పార్టీలూ వీటికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో లోకనాయకుడు కమల్ హసన్ మరో రెండు రోజుల్లో శుభవార్త చెబుతానని ప్రకటించారు.
దేశంలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది. దాదాపు అన్ని పార్టీలూ వీటికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో లోకనాయకుడు కమల్ హసన్ మరో రెండు రోజుల్లో శుభవార్త చెబుతానని ప్రకటించారు.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఓ బాణాసంచా తయారీ కార్మాగరంలో పేలుడు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది కార్మికులు మృతి చెందారు. ఇందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మానవతప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
మొదటి సారిగా ఓ ట్రాన్స్ జెండర్ రైల్వే ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన సింధు అనే మహిళా ట్రాన్స్ జెండర్ ఈ ఘనత సాధించారు. నాగర్ కోవిల్‌కు చెందిన ఈమె తమిళ సాహిత్యంలో బి.లిటరేచర్ చేశారు.
దళపతి విజయ్ రాజకీయ ప్రవేశంపై సీనియర్ నటుడు రజనీకాంత్ స్పందించారు. యువకులు రాజకీయాల్లోకి రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘విజయ్‌కు నా శుభాకాంక్షలు’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘తమిళగ వెట్రి కట్చి’ పేరుతో విజయ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.
రాతపూర్వక హామీ లేకుండా హిందువులు కానివారిని ఆలయం లోపలికి అనుమతించకూడదంటూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. ధ్వజస్థంభం దాటి ఆలయ ప్రాంగణం లోపల 'హిందువులు కానివారిని అనుమతించడం లేదు'అని సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తమిళనాడులోని సేలం వద్ద కర్నాటక నుంచి వరిసాగు చేస్తున్న ట్రక్కు ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో దంపతులు చనిపోయారు. వారి పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. రామన్ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
తమిళనాడు సింగిలిపట్టు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్రకు వెళ్లి తిరిగివస్తున్న ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు వేగంగా సిమెంట్ లారీని ఢీ కొట్టింది. ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం చేందారు. ఈ ప్రమాదానికి కారు డ్రైవర్ నిద్రమత్తు కారణమని పోలీసులు తెలిపారు.
తమిళనాడులో జల్లికట్టు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. అవనియాపురంలో ఈ పోటీల నిర్వహణ కోసం ముమ్మురంగా ఏర్పాట్లు చేశారు.
చెన్నైలో నందంబాక్కం ట్రేడ్ సెంటర్లో రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ 2024 సందడిగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. సింగపూర్, కొరియా, డెన్మార్క్ సహా వివిధ దేశాల ప్రముఖ కంపెనీలు సదస్సులో పాల్గొంటున్నాయి