71th National Film Awards 2025: డైరెక్టర్ సుకుమార్ కూతురి సత్తా.. తొలి సినిమాతో నేషనల్ అవార్డు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి 71వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ బాలనటిగా ఎంపికయ్యారు. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు ఈ అవార్డు లభించింది. తొలి చిత్రానికే జాతీయ అవార్డు సాధించి, తండ్రికి తగ్గ తనయగా నిలిచారు.