CM Revanth Reddy: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుటుంబ సమేతంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ ఉత్తమ బాల నటిగా ఎంపికైన సుకుమార్ కుమార్తె సుక్రుతీ వేణి సత్కరించి, అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సుకుమార్ తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. సుకుమార్ కుటుంబంతో పాటు నిర్మాత యలమంచలి రవిశంకర్ తదితరులు సీఎం రేవంత్ కలిశారు. 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి గానూ సుకృతి నేషనల్ అవార్డు గెలుచుకుంది. పర్యావరణ పరిరక్షణ ప్రధానాంశంగా దర్శకురాలు పద్మావతి మల్లాది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రకృతిని కాపాడుకోవడం ఎంత ముఖ్యం అనే అంశాలను చూపించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
Hon’ble Chief Minister of Telangana Shri. @revanth_anumula Garu congratulated and felicitated #SukritiVeniBandreddi on winning the National Award for #GandhiTathaChettu ✨
— Sukumar Writings (@SukumarWritings) August 19, 2025
Director #Sukumar Garu, @Thabithasukumar Garu, producer #RaviShankar Garu and the entire team met the CM.… pic.twitter.com/Xpni7VjvOL
సుకుమార్ భార్య తబిత సుకుమార్ ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. విడుదలకు ముందే ఈ చిత్రం పలు అంతర్జాతీయ వేడుకల్లో ప్రదర్శితమైంది. అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ముందుగా ఒక షార్ట్ ఫిల్మ్ రూపంలో విడుదల చేసిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్స్ లో విడుదల చేశారు. థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఆదరణ మరింత పెరిగింది. ఎంతో మంది సినీ ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు పొందింది.
'గాంధీ తాత చెట్టు' అవార్డులు
'గాంధీ తాత చెట్టు' చెట్టులో సుకృతి నటనకు జాతీయ పురస్కారంతో పాటు భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వరించాయి. అలాగే 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'గాంధీ తాత చెట్టు' ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. దీంతో పాటు న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరి బెస్ట్ చిత్రంగా నిలిచింది. జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ బెస్ట్ జ్యూరీ ఫిల్మ్ గా అవార్డులు గెలుచుకుంది.
ఇదిలా ఉంటే సుకుమార్ కూతురు సుకృతి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. మహేష్ బాబు కూతురు సితార, సుకృతి ఇద్దరూ కలిసి తరచూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. చిన్న వయసులోనే నటిగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ .. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.