Kishan Reddy: కేసీఆర్ పాలనలో రైతులు గోస పడుతున్నారు
సీఎం కేసీఆర్‌పై ఎంపీ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్‌పై ఎంపీ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
మెడికో రమేశ్ కృష్ణ అనుమానాస్పద కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆమె వాట్సాప్ చాటింగ్, ఫోన్ డేటా ఆధారంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో రమేశ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రియుడితో మనస్పర్థల కారణంగానే ఆమె ఆత్మ హత్యకు పాల్పడినట్టు పోలీసులు వర్గాల ద్వారా తెలుస్తోంది.
తిరుపతి జిల్లా భాకారాపేట అడవిలో ఓ మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.జిల్లాకు చెందిన రామ సముద్రం మండలం చిట్టెంవారి పల్లికి చెందిన కల్యాణి (15), చౌడేపల్లె మండలం జోగిఇండ్లు(కొత్తిండ్లు) గ్రామానికి చెందిన యుగంధర్ (17) ఇద్దరు కలిసి పుంగనూరులో ఓ కాలేజీలో ఇంటర్ సెంకడియర్ చదువుతున్నారు.
విజయవాడలోని భవానీపురంలో లలిత అనే మహిళ తన భర్త, కుమార్తెతో నివసిస్తోంది. తనకు ఒక్కగానొక్క కూతుర్ని ఎంతో అల్లారు ముద్దగా పెంచుతూ.. తన కాళ్ల మీద తాను నిలబడేలా ఎంబీఏ వరకూ చదివించారు. దీంతో ఆమెకి హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత తాను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతడ్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని పేరెంట్స్ కి చెప్పింది. పేరెంట్స్ కూడా తన ప్రేమని ఒప్పుకోవడం లేదని.. ప్రేమించిన అబ్బాయితో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది యువతి. దీంతో తల్లి లలిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ ఐఐటీ మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. కనిపించకుండా పోయిన విద్యార్థి కార్తీక్ విశాఖ బీచ్ లో శవమై తేలాడు. జులై 17 రాత్రి నుంచి కార్తీక్ కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు..కార్తీక్ వైజాగ్ వెళ్లినట్లు గుర్తించారు.
పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో పోలీస్ అధికారి తనువు చాలించిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. పోలీస్ అధికారి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాక తనతోపాటు కుటుంబీకులను సైతం చంపేశాడు స్థానికంగా ఏసీపీగా పని చేస్తున్న 57 ఏళ్ల భరత్ గైక్వాడ్.. భార్య, మేనల్లుడిని కాల్చి చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు భరత్ గైక్వాడ్ అతని భార్య మోని గైక్వాడ్, మేనల్లుడు దీపక్‌గా గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.