ఆ ప్రిన్సిపాల్ మాకు వద్దు.. మా బాధను అర్థం చేసుకోండి
దామెరకుంటలో గురుకుల పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని, మెనూ సరిగా పాటించడం లేదని ఆరోపిస్తూ రహదారిపై బైఠాయించారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అధికారులు సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.