BIG BREAKING: సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ షాక్
రాహుల్, సోనియా గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. రూ.752కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.
రాహుల్, సోనియా గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. రూ.752కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. ఈ మేరకు సోనియా గాంధీ ముఖ్య నేతలతో సమావేశమై పలు సూచనలు చేశారు. అసంతృప్తులపై ఓ కన్నేసి ఉంచాలని రాష్ట్ర పీసీసీకి ఆదేశాలు పంపిచినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయ్యారు. ఆస్తమాతో బాధపడుతున్న సోనియా గాంధీ.. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కారణంగా మారింత ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్యుల సలహా మేరకు ఆమె ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు. టీపీసీసీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సర్వేల పేరుతో పార్టీని తప్పుదారి పట్టిస్తున్నాడని...ఫేక్ సర్వేలను నిర్వహించి బీసీలకు టికెట్లు తగ్గేలా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికల్లో బీసీలకు, వెనకబడిన వర్గాలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తన తల్లి సోనియాగాంధీకి నూరి కుక్కపిల్లను బహుమతిగా అందించారు. ఇప్పుడు దాని పేరుపై కొత్త వివాదం రాజుకుంది. కుక్క పిల్లకు నూరి అని పేరు పెట్టడంతో ఏఐఎంఐఎం(AIMIM)తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. పదిరోజులు గడుస్తున్నా రాహుల్ క్షమాపణ చెప్పకపోవడంతో... ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫర్హాన్ ప్రయాగ్ రాజ్‌లోని సీజేఎం కోర్టును ఆశ్రయించారు. దీంతో రాహుల్ గాంధీపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు...నవంబర్ 8కి విచారణను వాయిదా వేసింది. ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ఈ కుక్కను తన తల్లి సోనియాగాంధీకి బహుమతిగా ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈ చిక్కులు రాజకీయంగా కాదు...ఆయన తన తల్లి సోనియా గాంధీ (Sonia Gandhi) కి ఇచ్చిన కుక్క పిల్ల వల్ల. ఆయన కొద్ది రోజుల క్రితం గోవా(Goa) కి వెళ్లారు. అక్కడికి ఒంటరిగా వెళ్లిన ఆయన జంటగా తిరిగి వచ్చారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (RahulGandhi) కూడా ఈ ప్రపంచ జంతు దినోత్సవం రోజు తన తల్లి సోనియా గాంధీ(Sonia gandhi) ని సర్ప్రైజ్ చేశారు. తన ఇంటికి మరో కొత్త సభ్యుడిని తీసుకుని వచ్చి పరిచయం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై నేడు లోక్‌సభలో చర్చ జరుగనుంది. అయితే, సభలో కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆ సోనియా గాంధీ ప్రసంగిస్తారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం కోటా కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.