Jio: భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్.. జియో ప్లాట్‌ఫారమ్‌కు గ్రీన్ సిగ్నల్!
ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ను ప్రారంభించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ప్లాట్‌ఫారమ్‌లకు అనుమతి లభించింది. లక్సెంబర్గ్ SES భాగస్వామ్యంతో హై-స్పీడ్ ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు స్పేస్ రెగ్యులేటర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు రాయిటర్స్ నివేదించింది.