AP: విద్యార్థి తండ్రిని నగ్నంగా నిలబెట్టిన అధికారులు.. మంత్రి సీరియస్..!
మన్యం జిల్లాలో ఓ విద్యార్థి తండ్రిని టీచర్లు అవమానించిన ఘటనపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల కమిటీ ఎన్నికల సమయంలో పసుపు చొక్కా వేసుకున్నారన్న సాకుతో గిరిజనుడిని నగ్నంగా నిలబెట్టడం ఏంటని ఫైర్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు.