World Rose Day: క్యాన్సర్ రోగుల కోసం వరల్డ్ రోజ్ డేని ఎందుకు జరుపుకుంటారు?
క్యాన్సర్ రోగులకు ఓదార్పునిస్తూ, అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతీ ఏడాది సెప్టెంబర్ 22న వరల్డ్ రోజ్ డేని జరుపుకుంటారు. దీనిని క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం అని కూడా పిలుస్తారు. ఈరోజున క్యాన్సర్ రోగుల్లో ధైర్యం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.