Vyuham: ఈ నెల 16న వ్యూహం సినిమా రిలీజ్
ఆర్జీవీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై ఇటీవల ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకు తొలిగింది. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.
ఆర్జీవీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై ఇటీవల ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకు తొలిగింది. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.
ఈ రోజు సీఎం జగన్ తో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ఇటీవల ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ వ్యూహం సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా జగన్ తో ఆర్జీవీ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఆర్జీవీ తల నరికి తెచ్చిన వారికి కోటీ రూపాయలు ఇస్తానంటూ డైరెక్టర్ ఆర్జీవీపై అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై శ్రీనివాస్ రావును అరెస్ట్ చేసేందుకు సీఐడీ ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకోగా ఆయన ఇంట్లో లేరు.
ఆర్జీవీ తెరకెక్కించిన 'వ్యూహం' మూవీపై టీడీపీ నాయకుడు లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఎలక్షన్స్ ముందు ఇలాంటి సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని, జగన్ డబ్బులిచ్చి తీయిస్తున్నారని ఆరోపించారు. వర్మగారు కోడికత్తి, హూ కిల్డ్ బాబాయ్.. మూవీస్ కూడా తీయాలని సూచించారు.
వ్యూహం సినిమా CBFC సర్టిఫికేట్ తెలంగాణ హైకోర్టు రద్దు చేసిందని జరుగుతున్న ప్రచారానికి ఆర్జీవీ చెక్ పెట్టారు. వ్యూహం సర్టిఫికేట్ ను హైకోర్టు రద్దు చేయలేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కొల్లాపూర్ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క తరఫు లాయర్ ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు.
''వర్మ గారు మీరు నా పోస్ట్ కి స్పందించినందుకు చాల సంతోషంగా ఉంది కొంచెం షాక్ కి కూడ గురయ్యాను ఎందుకంటే మీరు చనిపోయి దాదాపు ఇరవై ఏళ్లు దాటింది...'' అంటూ మెగా బ్రదర్ నాగబాబు ఆర్జీవీ కి మరో కౌంటర్ ఇచ్చారు.
గత ఎన్నికల్లో ఓటమిపాలైన పవన్.. నిన్న విశాఖ సభలో లింకన్ అనేక ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఇటు పవన్ కామెంట్స్ పై ట్విట్టర్ లో స్పందించారు ఆర్జీవీ. ఆ సమయంలో లింకన్ గురించి ఎవరికీ తెలియదన్న వర్మ మీరొక సూపర్ స్టార్ అయి ఉండి కూడా ఓడిపోయారని చురకలంటించారు.
పవన్ కళ్యాణ్ పై మరోసారి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు దర్శకుడు ఆర్జీవీ. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారం కంటే బర్రెలక్క (శిరీష) చేస్తోన్న ప్రచారం మేలు అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఆర్జీవీ ట్వీట్ పై పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.