Revanth Reddy: తెలంగాణలో బీసీ కుల గణన.. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ.. వివరాలివే!
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ఆయన కోరారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు రేవంత్.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ఆయన కోరారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు రేవంత్.
కాలేజీ విద్యార్థులకు ఫ్రీగా ఇంటర్నెట్ అందించాలన్న హామీ ఇవ్వాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కేవలం రూ.5/రూ.10 కి తగ్గిస్తామని మరో హామీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది.
తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. నేతల మధ్య విమర్శల పర్వం మొదలైంది. మీ పాలన అదీ అంటే.. మీ పాలన ఇదీ అంటూ పరస్పర పొలిటికల్ యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య ట్విట్స్ వార్ గట్టిగా నడుస్తోంది.
నిన్న కాంగ్రెస్ లో చేరిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. వీరందరికీ రాహుల్ గాంధీ నుంచి టికెట్ విషయంలో స్పష్టమైన హామీ లభించినట్లు తెలుస్తోంది.
పైకి దోస్తీ.. లోపల కుస్తీ.. ఇదీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల పరిస్థితి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందట.
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. కోమటిరెడ్డిని తీవ్రంగా విమర్శించి పార్టీ మారిన కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఉత్తమ్, రేవంత్ కలిసి పార్టీలో చేర్చుకోవడంతో కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
బీఆర్ఎస్ నేత కుంభం అనిల్ కుమార్కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కుంభం అనిల్ భువనగిరిలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారని తెలిపారు. కొంతమంది ఓడిపోతే పారిపోతారని.. కానీ అనిల్ మాత్రం కార్యకర్తలను కాపాడుకుని నిలబడ్డారన్నారు.
ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరనున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తోడు దొంగలంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేసన ఆమె.. కేసీఆర్ పేరుకే తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారని, కేసీఆర్ మాత్రం ఎంఐఎం చేతిలో కీలు బొమ్మలా మారారని మండిపడ్డారు.