Revanth Reddy: ఈ నెల 17న కాంగ్రెస్ విజయభేరీ సభ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులతో సమావేశం అయ్యారు. ఈ నెల 17న జరిగే విజయ భేరీ సభపై రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులకు వివరించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులతో సమావేశం అయ్యారు. ఈ నెల 17న జరిగే విజయ భేరీ సభపై రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులకు వివరించారు.
కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్ల ఇంద్రసేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు పరేడ్ గ్రౌండ్లో సీబ్ల్యూసీ సమావేశం నిర్వహించుకోవడం కోసం కేంద్రాన్ని కోరినట్లు, దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ రాష్ట్రంలో ఇంతవరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగిగా ప్రకటించలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల అనంతరం మరోలా వ్యవహరించడం కేసీఆర్‌కు అలవాటైందన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ అదే జోష్‌లో తెలంగాణలోనూ అధికారం కోసం మరింత ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపిక కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో CWC సమావేశం నిర్వహించనున్నట్టుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మూడో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నాయి.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. అయన్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించారు. పార్టీలోకి వస్తే పాలేరు టికెట్‌పై చర్చిస్తామని కాంగ్రెస్ నేతలు హామి ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం తాను నల్గొండ స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని ఎంపీ వివరించారు.
కాంగ్రెస్ చేవెళ్లలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రజాగర్జన సభను నిర్వహించబోతుంది. టీపీసీసీ అత్యంత ప్రతిష్టాత్మంకగా చేపడుతున్న ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఏఐసీసీ చీఫ్ హోదాలో ఖర్గే తెలంగాణలో మొదటి సారి భారీ బహిరంగ సభలో హాజరై ప్రసంగించనున్నారు. దీంతో ఈ సభా ఏర్పాట్లపై టీపీసీసీ ముమ్మర కసరత్తు చేస్తోంది. మరోవైపు..ఖర్గే స్పీచ్ పై ఉత్కంఠ నెలకొంది..
కాంగ్రెస్ కు బిగ్ షాక్ . ఆ పార్టీ సీనియర్ నేత పీసీసీ ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు తన పదవికి, పార్టీ సభ్యత్వానికి శనివారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆయన పంపారు. ఆయన త్వరలోనే అధికారపార్టీలోకి చేరే అవకాశాలున్నట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు సీనియర్ నేత జగదీశ్వర్ రావ్ కూడా తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామాలతో కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిప్పలు తప్పేట్టుగా లేవు...