KTR vs Revanth: 'డ్రామారావు.. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార'.. మొండి కత్తి డ్రామా!
బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దాడి చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని.. ఓ నేరస్థుడిని టీపీసీసీ అధ్యక్షుడిగా చేశారంటూ కేటీఆర్ వేసిన ట్వీట్‌పై రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని చిల్లర రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే మీ కచరా ప్రయత్నం చూస్తుంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయం ఐనట్టేనంటూ మండిపడ్డారు.