2000 Notes: 2000 నోటు మార్చుకోవడానికి టైమ్ లేదు..రేపే చివరి రోజు!
భారత ప్రభుత్వం రద్దు చేసిన 2000 నోట్ల (2000 notes) మార్పు గడువు ముగుస్తుంది. వీటిని మార్చుకోవడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. శనివారం(Saturday) కూడా వీటిని బ్యాంకులో డిపాజిట్ (Deposite) చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్(RBI) ఇండియా తెలిపింది. సెప్టెంబర్ 30 తర్వాత 2000 రూపాయల నోటును బ్యాంకులు తీసుకోవని స్పష్టం చేసింది.