Allu Arjun: బన్నీకి ఆరోగ్యం బాలేదు..అందుకే పుష్ప 2 కి బ్రేక్!
అల్లు అర్జున్ వెన్ను నొప్పితో బాధపడుతుండటం వల్ల పుష్ప 2 సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
అల్లు అర్జున్ వెన్ను నొప్పితో బాధపడుతుండటం వల్ల పుష్ప 2 సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
ఇఫ్ఫీ వేడుకల సమయంలో కాంతార నటుడు రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు రష్మికని ఉద్దేశించి చేసినవే అన్నట్లు ఉన్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా..అది నిజం కాదని రిషబ్ శెట్టి క్లారిటీ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నటి రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు వేగం పెంచారు. బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడి ఖాతా నుంచే ఈ వీడియో అప్లోడ్ అయినట్లు గుర్తించి అతనికి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ రిలేషన్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు రష్మిక హాజరైందంటూ నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. ఒకే తరహా లొకేషన్స్ కనిపిస్తున్న వీరిద్దరి పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘానికి థాంక్స్ చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన తన డీప్ ఫేక్ వీడియోను ఖండిస్తూ తనకు సపోర్టుగా నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేసింది. వాళ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొని దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ అమ్మడు వరుస ప్రాజెక్ట్స్ తో ఇటు సౌత్ లో అటు నార్త్ లో తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటోంది.తాజాగా వుమెన్ ఓరియెంటెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతోందని తెలుస్తోంది. ద గర్ల్ ఫ్రెండ్ పేరుతో మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది టీమ్.
వరుసపెట్టి సినిమాలు చేస్తున్న శ్రీలీల, చాలా ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది కానీ కాల్షీట్లు మాత్రం ఎడ్జెస్ట్ చేయలేకపోతోంది. ఎవరికైనా ఉన్నది 24 గంటల టైమ్ మాత్రమే. శ్రీలీల కూడా ఆ టైమ్ లోనే కాల్షీట్లు సర్దుబాటు చేయాలి. అలా ఈ బ్యూటీ రోజుకు 2 సినిమాలు, ఒక్కోసారి 3 సినిమాలు కూడా చేస్తోంది.
ఓ ఏడాదికి సరిపడ కాల్షీట్లు ఇప్పటికే ఎడ్జెస్ట్ చేసిన రష్మిక, ఇప్పుడు వచ్చే ఏడాది సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది పుష్ప-2, రెయిన్ బో, యానిమల్ లాంటి సినిమాలకు కాల్షీట్లు ఇచ్చిన ఈ బ్యూటీ, వచ్చే ఏడాది మరిన్ని కొత్త సినిమాలకు కాల్షీట్లు ఇస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం యానిమల్. ఈ మూవీ గురించి బాలీవుడ్ తెగ ఎదురు చూస్తోంది. ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా...టెక్నికల్ రీజన్స్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా యానిమల్ హీరోయిన్ రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.