Ayodhya : ప్రాణ ప్రతిష్టలో పాల్గొనలేకపోతున్నా.. ఎల్కే అద్వానీ
బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఈరోజు అయోధ్యలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్టకు హాజరుకావడం లేదు. ప్రస్తుతం ఉత్తర భారతంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే తాను అయోధ్యకు రావడం లేదని అంత చలిని తట్టుకునే శక్తి తనకు లేదని అద్వానీ చెబుతున్నారు.