BREAKING: తెలంగాణలో ముగిసిన పోలింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా అంతా సవ్యంగానే జరిగినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో పోలింగ్ జరగగా అత్యల్పంగా హైదరాబాద్‌లో నమోదైంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా అంతా సవ్యంగానే జరిగినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో పోలింగ్ జరగగా అత్యల్పంగా హైదరాబాద్‌లో నమోదైంది.
తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 13 ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టుల ప్రభావమున్న ప్రాంతాల్లో 4 గంటలవరకే పోలింగ్ నిర్వహిస్తామని చెప్పిన అధికారులు నిర్దేశించిన సమయంలో పోలింగ్ బూత్ కు రానివారిని లోపలికి అనుమతించలేదు.
సెలవు అయితే తీసుకున్నారు కానీ దేనికోసం అయితే హాలిడే ఇచ్చారో ఆ విషయం మాత్రం మర్చిపోయారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం అయిన ఓటును వేయడానికి కూడా బద్ధకిస్తున్నారు హైదరాబాద్ ఓటర్లు. పోలింగ్ మొదలై ఐదు గంటలు గడుస్తున్నా ఇంకా 13 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది.
తెలంగాణ పోలింగ్ షురూ అయిన తర్వాత కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య లోపులాటు, వాగ్వాదాలు జరిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జీలు చేయవలసి వస్తోంది.
తెలంగాణలో ఓటు వేయడానికి జజాలు బారులు తీరుతున్నారు. దూరమైనా సరే వెళ్ళి ఓటేస్తున్నారు. ఈ క్రమంలో జనాలు ఉచిత ర్యాపిడో సేవలను సైతం వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ లో 26 కేంద్రాలకుర్యాపిడో ఈరోజంతా ఉచిత రైడ్ లను ఇస్తున్నామని ప్రకటించింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ బూత్ ల ముందు జనాలు క్యూలు కడుతున్నారు. వారితో పాటూ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు సాగర్ డ్యామ్ దగ్గర గొడవ అయ్యిందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కావాలనే పోలింగ్ రోజున తెలంగాణ సెంటిమెంట్‌ను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు.
పోలింగ్ మొదలైంది. కానీ ఇంకా మీ చేతికి ఓటర్ కార్డు లేదా ఓటర్ స్లిప్పు రాలేదని బెంగపడుతున్నారా...ఏం పర్లేదు, ఈరెండూ లేకపోయినా మీరు హాయిగా వెళ్ళి ఓటేయొచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు ఒకటి ఏదైనా మీ దగ్గర ఉంటే చాలు..ఓటేసేయొచ్చు.