Susil Modi: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కన్నుమూత!
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. 72 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు.
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. 72 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు.
ఏపీలో ఇంకా 3500 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతుందని ఏపీ సీఈవో ఎంకే మీనా పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 100 నుంచి 200 మంది వరకు ఓటర్లు ఉన్నారన్నారు. పది గంటలకల్లా అన్ని చోట్లా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని మీనా వివరించారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. తెలంగాణ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయం ముగిసింది. తెలంగాణలోని 5 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది.
విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కొత్త శ్రీరంగరాజపురంలో ని పోలింగ్ కేంద్రంలో పీవోగా చేస్తున్న రాంబాబు అనే వ్యక్తి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలతో పాటు.. ఓట్లు వేసే సమయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు..అతడిపై దాడికి దిగి చితకబాదారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ- వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలి పంచాయితీ చిన్నిళ్లుగారిపల్లెలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఈ దాడుల్లో టీడీపీ నాయకులు ఇద్దరికి, వైసీపీ నాయకులు నలుగురికి గాయాలు అయ్యాయి.
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ స్థానంలో ఆసక్తికర విషయం ఒకటి చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీనే స్వయంగా నోటా గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహిస్తుంది. అసలు ఇలా ఎక్కడ జరిగింది..ఎందుకు జరిగింది అనే విషయాలను ఈ స్టోరీ లో చదివి తెలుసుకోండి.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోమవారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తన సమర సన్నద్దతను చాటి చెప్పారు. ఎన్నికల సమరంలో తనని తాను అర్జునుడిగా చెప్పుకున్నారు. మహా సంగ్రామంలో పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదని అర్జునుడని పేర్కొన్నారు.
శనివారం ఉదయం దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకో జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయిందని ఆరోపించారు.
ఏపీలో ఉన్న పరిశ్రమలను ఐదేళ్లలో వైసీపీ గవర్నమెంట్ దెబ్బతీసిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. 2019కి ముందు కోళ్ల పెంపకానికి సంబంధించి రైతులకు ఇంట్రెస్ట్ సబ్సిడీ సౌకర్యం ఇచ్చేవారని 2019 నుంచి 2024 వరకు సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారని మండిపడ్డారు.