PM Modi: కొడుకు కోసం సోనియా గాంధీ ఓట్లు అడుగుతున్నారు.. ప్రధాని మోదీ ఫైర్
సోనియా గాంధీ కోవిడ్ తర్వాత ఒక్కసారి కూడా తన నియోజకవర్గమైన రాయ్‌బరేలీని సందర్శించలేదని అన్నారు మోదీ. ఇప్పుడు ఆమె తన కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. వారు రాయ్‌బరేలీ సీటును తమ కుటుంబ ఆస్తిగా భావిస్తారని చురకలు అంటించారు.