Peddavagu Project: హైటెన్షన్.. కొత్తగూడెం జిల్లా పెదవాగు ప్రాజెక్టుకు గండి
TG: కొత్తగూడెం జిల్లా పెదవాగు ప్రాజెక్టుకు నిన్న రాత్రి గండి పడింది. దీంతో ప్రాజెక్ట్‌లోని నీళ్లు మొత్తం ఖాళీ అయ్యాయి. వరద ప్రవాహంతో అశ్వారావుపేట మండలం నారాయణపురం బ్రిడ్జిపై 40 మంది చిక్కుకున్నారు. వీరందరిని ఎయిర్ బోట్లతో సురక్షిత ప్రాంతానికి తరలించారు సహాయక సిబ్బంది.