Peddavagu Project: హైటెన్షన్.. కొత్తగూడెం జిల్లా పెదవాగు ప్రాజెక్టుకు గండి TG: కొత్తగూడెం జిల్లా పెదవాగు ప్రాజెక్టుకు నిన్న రాత్రి గండి పడింది. దీంతో ప్రాజెక్ట్‌లోని నీళ్లు మొత్తం ఖాళీ అయ్యాయి. వరద ప్రవాహంతో అశ్వారావుపేట మండలం నారాయణపురం బ్రిడ్జిపై 40 మంది చిక్కుకున్నారు. వీరందరిని ఎయిర్ బోట్లతో సురక్షిత ప్రాంతానికి తరలించారు సహాయక సిబ్బంది. By V.J Reddy 19 Jul 2024 in Latest News In Telugu ఖమ్మం New Update షేర్ చేయండి Peddavagu Project: కొత్తగూడెం జిల్లా పెదవాగు ప్రాజెక్టుకు గండి పడింది. గురువారం రాత్రి ప్రాజెక్ట్‌కు గండి పడినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రాజెక్టులో నీళ్లు మొత్తం ఖాళీ అయ్యాయి. ముంపు ప్రాంతాల్లో రాత్రంతా భయానక వాతావరణం నెలకొంది. రాత్రంతా భవనాలపైకి వెళ్లి ముంపు గ్రామాల ప్రజలు తలదాచుకున్నారు. పెదవాగు ఉధృతికి వేలేరుపాడులో వంతెన కొట్టుకుపోయింది. పెదవాగు ప్రాజెక్టు గండితో 40 మంది వరదలో చిక్కుకున్నారు. అశ్వారావుపేట మండలం నారాయణపురం బ్రిడ్జిపై చిక్కుకున్న 40 మందిని ఎయిర్ బోట్లతో బాధితులను తరలించారు సహాయక సిబ్బంది. దీనిపై సకాలంలో స్పందించాయి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు. #peddavagu-project మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి