Peddavagu Project: పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రి తుమ్మల

TG: పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించనున్నారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ప్రాజెక్టు గండి కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శిస్తారు. బాధిత రైతాంగానికి ప్రభుత్వం తరఫున భరోసా కల్పించనున్నారు.

New Update
Peddavagu Project: పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రి తుమ్మల

Peddavagu Project: పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించనున్నారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ప్రాజెక్టు గండి కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శిస్తారు. బాధిత రైతాంగానికి ప్రభుత్వం తరఫున భరోసా కల్పించనున్నారు. పెద్దవాగు వరద బీభత్సం కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఇప్పటికే అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

పెద్దవాగు వరద బీభత్సం కారణంగా అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం, గుమ్మడివల్లి, బచ్చువారిగూడెం గ్రామాల్లో మొత్తం 1208 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక అంచనా వేశారు. 512 మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మతులపై ఇరు ప్రభుత్వాలు కలిసి చర్చించేలా చొరవ చుపుతున్నారు మంత్రి తుమ్మల. ప్రాజెక్టు స్థితిగతులపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు మంత్రి తుమ్మల. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న పెద్దవాగు మరమ్మతులపై త్వరలో ఇరు ప్రభుత్వాలు కలిసి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు