Loksabha today:మూడు న్యాయసంహిత బిల్లులకు లోక్ సభలో ఆమోదం
పాత చట్టాలు పోయి కొత్త చట్టాలు వస్తున్నాయి. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడింటి స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన మూడు న్యాయసంహిత బిల్లులకు ఈరోజు లోక్ సభ ఆమోదం తెలిపింది.
పాత చట్టాలు పోయి కొత్త చట్టాలు వస్తున్నాయి. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడింటి స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన మూడు న్యాయసంహిత బిల్లులకు ఈరోజు లోక్ సభ ఆమోదం తెలిపింది.
మీడియా తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 150 మంది ఎంపీలను బయటకు పంపిస్తే మీడియాలో కనీసం చర్చ లేదన్నారు. ఉపరాష్ట్రపతిని ఎవరూ ఎమీ అనలేదని క్లారిటీ ఇచ్చారు రాహుల్. ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని మీడియాకు సూచించారు రాహుల్.
పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ భద్రతపై ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం దేశ పార్లమెంటరి వ్యవస్థకే మచ్చగా పేర్కొన్నారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. లాస్ట్ వీక్ చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై విపక్షాలు పెద్ద ఎత్తున నిరసలను చేపట్టాయి. దీంతో ఒక్క రోజే 92 మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేశారు.
డిసెంబర్ 13న పార్లమెంట్‌ను కుదిపేసిన భద్రతా ఉల్లంఘనపై ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆరు రాష్ట్రాలైన రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలకు బృందాలను పంపింది.
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన దురద్రుష్టకరమన్నారు. ఆందోళనకరమైన సంఘటనగా అభివర్ణించారు ప్రధాని. ఈ ఘటనపై లోకసభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్ చర్యలు తీసుకుంటారని...ఈ ఘటనను తక్కువ అంచనా వేయద్దన్నారు.
పార్లమెంటులో భద్రతా వైఫల్యం జరడంతో పోలీసులు ఆరుగురు నిందుతుల్ని అరెస్టు చేశారు. అయితే గురువారం రాత్రి ఆరో నిందితుడు లలిత్ మోహన్ గురువారం రాత్రి ఢిల్లీలోని కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లోంగిపోయాడు. ప్రస్తుతం వీరిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పార్లమెంటు దాడికి ప్రధాన సూత్రధారుడు అయిన లలిత్ ఝా గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇతను దాడి తర్వాత నీలాక్ష్ అనే వ్యక్తితో మాట్లాడినట్టు తెలుస్తోంది. దాడి వీడియో కూడా అతనికి వాట్సాప్ లో పంపాడని పోలీసులు చెబుతున్నారు.
మహిళలకు నెలసరి అనేది వైకల్యం కాదు..జీవితంలో అదొక ప్రక్రియ. దానికి సెలవు ఇస్తే వివక్ష రావచ్చు అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆడవారు అయి ఉండి మీరే ఇలా అంటే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.