పహల్గాంలో మరో విషాద కథ | Another tragic story in Pahalgam | Neeraj | RTV
పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ కూడా భారత్ నుంచి విడిచి వెళ్లాల్సి వస్తుందా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో నెలకొన్నాయి. సీమా హైదర్ అనే పాకిస్తానీ మహిళ రెండేళ్ల క్రితం తన నలుగురు పిల్లలతో కలిసి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది.
పహల్గాం ఉగ్రదాడికి ముందు ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, తన భార్య హిమాన్షితో డ్యాన్స్ చేసిన వీడియో ఇదేనంటూ ఒక క్లిప్ వైరలైంది. ఆ వీడియోలో ఉన్నది వినయ్ జంట కాదని.. తామేనంటూ ఆశిష్ షెహ్రావత్, యషిక శర్మ జంట ఒక వీడియో రిలీజ్ చేసింది.
ఫిరోజ్‌పూర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద BSF జవాన్ ను పాక్ సైన్యం బంధించింది. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ అరెస్టు చేశామని చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను BSF ఖండించింది.
సింధు జలాల్లోని ప్రతీ నీటి బొట్టుపై తమకు హక్కు ఉందన్నారు పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము న్యాయపరంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిర్లక్ష్యంగా నిలిపివేయడం పిరికితనమని అన్నారు.
ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు కోల్పోయాడు. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్ భూషణ్ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్ ప్రకటించారు.
టెర్రరిస్టుల దాడికి వ్యతిరేకంగా కశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మృతులు, బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ అక్కడి ప్రజలు, వ్యాపారులు, హోటల్స్ యజమానులు రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఆర్మీకి అండగా ఉంటాం అంటూ నినాదాలు చేశారు.